

దళితులు, ఆదివాసీల ఆత్మగౌరవం, గౌరవాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఎంపీ మల్లు రవి నేతృత్వంలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హల్ద్వానీలో నిర్వహించిన సభ అనంతరం అక్కడ ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించారన్న ఘటన దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని భట్టి పేర్కొన్నారు. అస్పృశ్యతకు వ్యతిరేకంగా కాంగ్రెస్ గతంలో తీసుకున్న చర్యలను ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ విలువలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని, మనుస్మృతి భావజాలాన్ని ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఖర్గే ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరిన రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడాన్ని కూడా భట్టి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై వివక్షకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!