వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సంక్రాంతి వేడుకల సందర్భంగా లక్కీ డ్రా పేరిట అక్రమ వసూళ్లు చేశారనే కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసు, అలాగే ‘ఛలో మెడికల్ కాలేజీ’ నిరసన కేసుల్లోనూ బెయిల్ పొందిన ఆయనకు ఈ కేసు కారణంగా విడుదల ఆలస్యమైంది. తాజాగా లక్కీ డ్రా కేసులో కూడా బెయిల్ రావడంతో విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగినట్లుగా భావిస్తున్నారు. అదేవిధంగా ఆయనను పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించడం కూడా ఆయనకు మరింత ఉపశమనం కలిగించింది.
2023 సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో లాటరీ పేరిట పింఛన్ లబ్ధిదారుల నుంచి రూ.200 చొప్పున వసూలు చేసి టికెట్లు ఇచ్చారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల పీటీ వారెంట్ జారీ కావడంతో అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ మొదట 14 రోజుల రిమాండ్ విధించగా, అనంతరం గుంటూరు కోర్టులో దాఖలైన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది.






.avif&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!