
టెక్నాలజీ

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేసింది. 48 గంటల్లోగా ఆయన పదవి నుంచి తప్పుకోవాలని గడువు విధించింది. ఆలోగా రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించింది. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో సీజేపీ ఈ డిమాండ్ చేసింది.
ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలపై స్పష్టత వచ్చే వరకు రాబోయే అన్ని ఎన్నికలను నిలిపివేయాలని కూడా సీజేపీ కోరింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియను 2025 జనవరి నాటి స్థితికి వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేసింది. తమ డిమాండ్లపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని సీజేపీ తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!