

కొత్త యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యాపార సంఘాలు అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’ పాటించాలని నిర్ణయించాయి. మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వ్యాపారులు యూపీఐ క్యూఆర్ స్కానర్లు, పేమెంట్ సౌండ్ బాక్స్‌లు, ఇతర పరికరాలకు నల్లటి వస్త్రాలు కప్పి నిరసన తెలపనున్నారు. అక్టోబర్ 15 నుంచి కొత్త ఎండీఆర్ విధానం అమల్లోకి రానుంది.
కొత్త విధానం ప్రకారం రూ.2 వేలకుపైగా విలువైన అర్హత కలిగిన వ్యాపారి యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 వరకు ఛార్జీ ఉంటుంది. వ్యక్తుల మధ్య జరిగే చెల్లింపులు, రూ.2 వేల వరకు వ్యాపారి లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి. నెలకు రూ.లక్ష వరకు యూపీఐ ద్వారా ఆదాయం పొందే అర్హత కలిగిన చిన్న వ్యాపారులకు కూడా మినహాయింపు ఉంటుంది. తక్కువ మార్జిన్లతో వ్యాపారం చేసే తమపై ఈ ఛార్జీలు అదనపు ఆర్థిక భారాన్ని మోపుతాయని వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెట్రోల్ డీలర్లు, స్టాక్ బ్రోకర్లు కూడా మినహాయింపులు కోరుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!