

దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నించేలా ఉందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసి, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘సంవిధాన్ బచావో’ అంటూ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారని, అదే నిబద్ధతను తెలంగాణలోనూ పాటించాలని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన ఇతర ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి, తిరిగి ప్రజల తీర్పు కోరాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయాలని కోరారు. ‘సంవిధాన్ బచావో’ కేవలం రాజకీయ నినాదమా, లేక నిజమైన రాజ్యాంగ నిబద్ధతా అనేది రాహుల్ గాంధీ స్పష్టం చేయాలని హరీశ్‌రావు అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!