

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. అయితే ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రస్తుతం మార్పు లేదు. ఐసీఆర్ఏ అంచనా ప్రకారం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ విక్రయాలపై చమురు మార్కెటింగ్ సంస్థలకు రోజుకు సుమారు రూ.530 కోట్ల నష్టం వస్తోంది. సెప్టెంబర్ 21న భారత క్రూడ్ బాస్కెట్ ధర బ్యారెల్‌కు 117.4 డాలర్లకు చేరింది.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, కీలక చమురు సరఫరా మార్గాల్లో అంతరాయాలు ముడిచమురు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఐసీఆర్ఏ అంచనా ప్రకారం పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ.8, డీజిల్‌పై లీటరుకు రూ.9 మేర ప్రతికూల మార్కెటింగ్ మార్జిన్ ఉంది. సెప్టెంబర్‌లో ఒక్క వంటగ్యాస్ సిలిండర్‌పై సుమారు రూ.300 రికవరీ లోటు నమోదవుతోంది. అంతర్జాతీయ చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే చమురు సంస్థలపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!