
గాసిప్స్

ఈ నెల 29 నుంచి అసెంబ్లీ వింటర్ సెషన్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 30, 31తో పాటు జనవరి 1న శాసనసభ సమావేశాలు జరగవు. అనంతరం జనవరి 2 నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో గోదావరి–కృష్ణా జలాల అంశం ప్రధాన ఎజెండాగా నిలవనుంది.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి వాటాలు, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతులు లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, నీటిపారుదల రంగంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను శాసనసభలో ఎండగట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన మంత్రుల భేటీలో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!