
గాసిప్స్

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. క్యాబినెట్ సమావేశం ప్రారంభ సమయంలో ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ, ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఐదుగురు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాలను కలచివేసిందని క్యాబినెట్ సభ్యులు పేర్కొన్నారు.
అజిత్ పవార్‌తో తనకు ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ఘటన తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మృతికి సంతాపం తెలుపుతూ ఏపీ క్యాబినెట్ ప్రత్యేక తీర్మానం ఆమోదించి, మృతులకు నివాళులు అర్పించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!