
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నాదెండ్ల మనోహర్, మాధవ్ భేటీ అయ్యారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రధాన చర్చనీయాంశంగా నిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి నేతలు పలుమార్లు సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం సాధించడం, ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగడం వంటి అంశాలపై నేతలు దృష్టి సారించినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!