

అమిత్ షా శుక్రవారం కోల్కతాకు వెళ్లనున్నారు. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసే కీలక సమావేశం ఈరోజు జరగనుంది. సాయంత్రం 4 గంటలకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో అమిత్ షా సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో పార్టీ శాసనసభా నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఎన్నికైన నాయకుడు శనివారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి రేసులో సువేందు అధికారి పేరు ముందంజలో వినిపిస్తోంది. బెంగాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించిన ఆయన, మమతా బెనర్జీను భవానిపూర్ నియోజకవర్గంలో ఓడించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. దీంతో పార్టీ అధిష్ఠానం ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు దిలీప్ ఘోష్, సమీక్ భట్టాచార్య, అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ పేర్లు కూడా సీఎం రేసులో వినిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!