
జనరల్

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు వేరు కుంపటి పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలపై యూపీ మంత్రి, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ స్పందించారు. ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తమ ఎంపీలను కాపాడుకోవాలని, సోషల్ మీడియాలో రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. తిరుగుబాటు ఎంపీలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణలను అఖిలేశ్ యాదవ్ ఖండిస్తూ రాజ్‌భర్‌ను “పుకార్ల శాఖ మంత్రి”గా అభివర్ణించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ హోం మంత్రి అమిత్ షాపై విమర్శలు చేస్తూ ఎన్డీఏను ఫిరాయింపుదారుల కూటమిగా మార్చుతున్నారని జైరాం రమేశ్ ఆరోపించారు. లోక్‌సభలో రెండు మూడొంతుల మెజారిటీ కోసం జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాలు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!