
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే, టీవీకే మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని జరుగుతున్న ప్రచారం టీవీకేలో గుబులును పెంచుతోంది. మరోవైపు అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని తమ మిత్రపక్షం ఏఎంఎంకే గవర్నర్కు లేఖ అందించింది. ఏఎంఎంసీ చీఫ్ దినకరన్ గవర్నర్ ఆర్.వి. ఆర్లేకర్ను కలిసి ఈ అంశంపై చర్చించారు.
అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి సీనియర్ నేతలతో కీలక సమావేశానికి సిద్ధమవుతున్నారు. గవర్నర్ను కలిసి టీవీకేపై ఒత్తిడి పెంచాలని పళనిస్వామి భావిస్తున్నట్లు సమాచారం. టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, దినకరన్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!