
క్రీడలు

నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు జెండాలతో నిరసన చేపట్టి ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తంగా ఉన్న పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నిరసనకు పాల్పడిన ఇద్దరు ఆప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం బేగంపేట్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!