

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ ఒకటి. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో 2004లో విడుదలైన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న సినిమాను థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర రీరిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. చిరంజీవికి జోడీగా సోనాలి బింద్రే నటించిన ఈ చిత్రంలోని కామెడీ, పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
రీరిలీజ్ సందర్భంగా ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’కు సంబంధించిన ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిరంజీవి కామెడీ టైమింగ్, వినోదాత్మక సన్నివేశాలు, పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గతంలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు 4K వెర్షన్‌లో మరోసారి థియేటర్లలో సందడి చేయనుండటంతో మెగా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!