

మే 18 నుంచి 24 వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో భారీ వెబ్ సిరీస్‌లు, క్రైమ్ థ్రిల్లర్లు మరియు ఫ్యామిలీ డ్రామాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ‘దేశీ బ్లింగ్’, ‘ది బరోస్’ వంటి సిరీస్‌లు విడుదల కానుండగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో సోనాక్షి సిన్హా నటించిన క్రైమ్ డ్రామా ‘సిస్టమ్’పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అదే సమయంలో జీ5లో ‘సత్రాంగి’ అనే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కూడా స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
క్రైమ్, సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ కొత్త కంటెంట్ వీకెండ్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. సోనీ లివ్‌లో ‘ఉందేఖి’ కొత్త ఎపిసోడ్లు కూడా విడుదల కానుండటంతో థ్రిల్లర్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లోనూ పలు కొత్త సినిమాలు, సిరీస్‌లు విడుదల కానుండటంతో ఈ వారం ఓటీటీ ప్రియులకు నిజంగా పండగ వాతావరణం నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!