

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో చివరి భాగంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 27 (శుక్రవారం) నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. అయితే దక్షిణాది భాషల్లో ఈ సినిమా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. స్టార్ స్టూడియో 18 సమర్పణలో పనోరమా స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. అజయ్ దేవగణ్‌తో పాటు శ్రియ, టబు, ఇషితా దత్తా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.560 కోట్ల నుంచి రూ.580 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు నివేదికలు వెల్లడించాయి. థియేటర్లలో విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!