

ప్రపంచ సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ‘విహారి ఓటీటీ’ గ్లోబల్ విజన్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ‘బిగ్ బాస్’ ద్వారా గుర్తింపు పొందిన శ్రీ సత్య ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఓటీటీ విజన్‌ను లాంచ్ చేయడం విశేషంగా మారింది. దాదాపు 18 ఏళ్లుగా ట్రావెల్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న ‘విహారి’, ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ ఓటీటీ వేదికగా మారేందుకు సిద్ధమవుతోంది.
ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఆహార ప్రత్యేకతలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘విహారి’, ఇకపై డిజిటల్ వేదికలో మరింత విస్తృత స్థాయిలో కంటెంట్ అందించనుంది. ట్రావెల్ కథనాలకే అంకితమైన తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌గా ‘విహారి ఓటీటీ’ జూన్ నెలలో గ్రాండ్‌గా ప్రారంభం కానుందని నిర్వాహకులు వెల్లడించారు. తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఇది కొత్త దిశగా భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!