26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రక్షా ఎక్స్‌పో 2026 లో పాల్గొనాలని పరిశ్రమలకు ఉత్తమ్ ఆహ్వానం

Writer: Pooja 12:27 PM, 26 నవంబర్, 2026
రక్షా ఎక్స్‌పో 2026 లో పాల్గొనాలని పరిశ్రమలకు ఉత్తమ్ ఆహ్వానం

తెలంగాణలో రక్షణ, ఏరోస్పేస్ రంగాలు సంప్రదాయంగా బలంగా ఉన్న ఐటీ, ఫార్మా రంగాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ తెలంగాణ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కాన్‌క్లేవ్ 2026లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ రంగాల్లో ఉత్పత్తి, ఎగుమతులు ఏడాదికి 100 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాయని వెల్లడించారు. బలమైన తయారీ వ్యవస్థ, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తెలంగాణకు ప్రత్యేక బలమని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు రక్షణ పరిశోధన, ఏరోస్పేస్ తయారీలో ఉన్న సుదీర్ఘ అనుభవం రాష్ట్రానికి అదనపు ప్రయోజనమని చెప్పారు. విమాన విడిభాగాలు, రక్షణ ఎలక్ట్రానిక్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, డ్రోన్లు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు.

రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అంతర్జాతీయ తయారీ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలను అందుకుంటూ దేశీయ అవసరాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ రక్షణ, ఏరోస్పేస్ మార్కెట్లకు ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యంలో భాగంగా కొత్త పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, నాణ్యమైన ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా నిర్వహించనున్న రక్షా ఎక్స్‌పో 2026లో పాల్గొనాలని జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల ప్రతినిధులకు ఆయన ఆహ్వానం పలికారు. ఈ ఎక్స్‌పో ద్వారా పెట్టుబడులు, సాంకేతిక సహకారం, వ్యాపార భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన గత వైమానిక దళ పైలట్ అనుభవాలను కూడా గుర్తుచేసుకున్నారు. రష్యాలో శిక్షణ, మిగ్-23 యుద్ధ విమానాల నడిపిన అనుభవం, దేశ పశ్చిమ సరిహద్దుల్లో విధులు నిర్వహించిన రోజులను సభికులతో పంచుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..

దిల్లీలో మహిళలకు భద్రత కరువు.. మెట్రో స్టేషన్లు, బస్టాప్‌లకు నడిచి వెళ్లాలన్నా భయమే: అధ్యయనం

దిల్లీలో మహిళలకు భద్రత కరువు.. మెట్రో స్టేషన్లు, బస్టాప్‌లకు నడిచి వెళ్లాలన్నా భయమే: అధ్యయనం

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక..

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక..

తిరుమలలో భక్తుల వసతి సముదాయాలపై అధికారుల నిఘా

తిరుమలలో భక్తుల వసతి సముదాయాలపై అధికారుల నిఘా

ట్యాగ్లు
తెలంగాణ రక్షణ రంగంఏరోస్పేస్ పరిశ్రమఉత్తమ్ కుమార్ రెడ్డిరక్షా ఎక్స్‌పో 2026అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలుతెలంగాణ పెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డిసెంబర్‌ 15లోపు పార్లమెంట్‌ సమావేశాలు?
రాజకీయాలు

డిసెంబర్‌ 15లోపు పార్లమెంట్‌ సమావేశాలు?

తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్
జనరల్

తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుఖేష్ స్కామ్ కథ ఓటీటీలోకి
ఓటీటీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుఖేష్ స్కామ్ కథ ఓటీటీలోకి

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు
జనరల్

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌కు గేల్‌ ఫిదా..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌కు గేల్‌ ఫిదా..

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది - కలెక్టర్ జి. లక్ష్మీ శా
రాజకీయాలు

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది - కలెక్టర్ జి. లక్ష్మీ శా

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..
జనరల్

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..

రక్షా ఎక్స్‌పో 2026 లో పాల్గొనాలని పరిశ్రమలకు ఉత్తమ్ ఆహ్వానం
జనరల్

రక్షా ఎక్స్‌పో 2026 లో పాల్గొనాలని పరిశ్రమలకు ఉత్తమ్ ఆహ్వానం

మరోసారి దర్శకుడిగా రీఎంట్రీకి సిద్ధమైన కన్నడ స్టార్
సినిమాలు

మరోసారి దర్శకుడిగా రీఎంట్రీకి సిద్ధమైన కన్నడ స్టార్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన రామాయణ చిత్ర బృందం
సినిమాలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన రామాయణ చిత్ర బృందం

బిగ్ బాస్ ఇంట్లోకి సన్నీ, సిరి..
షోస్

బిగ్ బాస్ ఇంట్లోకి సన్నీ, సిరి..

ఆర్థిక కష్టాల నుంచి ఆస్కార్ విజేతగా ఏఆర్ రెహమాన్ స్ఫూర్తిదాయక ప్రయాణం
సినిమాలు

ఆర్థిక కష్టాల నుంచి ఆస్కార్ విజేతగా ఏఆర్ రెహమాన్ స్ఫూర్తిదాయక ప్రయాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!