

2004లో మా టీవీలో ప్రారంభమైన ‘విహారి – ది ట్రావెలర్’ కార్యక్రమం మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోంది. ప్రయాణాలు, ఆహారం, పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలతో ఈ షో ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకుంది. గతంలో కరుణ, స్నిగ్ధ వంటి యాంకర్లు ఈ కార్యక్రమం ద్వారా పలు ప్రత్యేకమైన ఎపిసోడ్లను అందించారు. ఇప్పుడు టెలివిజన్ నుంచి డిజిటల్ వేదికపైకి అడుగుపెడుతూ కొత్త ఓటీటీ యాప్ ద్వారా ప్రేక్షకులకు చేరువ కానుంది.
నవంబర్‌లో ప్రారంభం కానున్న ఈ యాప్‌లో యాంకర్ శ్రీ సత్య హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అదే నెల నుంచి యాంకర్ సుమతో రూపొందించే వినూత్నమైన ఎపిసోడ్లు కూడా ప్రసారం కానున్నాయి. విహారి ఓటీటీ ప్రోమో విడుదల కార్యక్రమానికి సదరన్ ట్రావెల్స్‌కు చెందిన ప్రవీణ్, వజ్ర కన్స్ట్రక్షన్స్‌కు చెందిన రాజు, శ్వేతతో పాటు యాంకర్ శ్రీ సత్య హాజరయ్యారు. ఈ ఓటీటీ వేదికకు టీటీఎఫ్, వేగ జ్యువెలర్స్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ప్రోమో విడుదల కాగా, యాప్ ప్రారంభంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!