

‘కొత్త బంగారు లోకం’ సినిమాలో వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్ జోడీకి మంచి గుర్తింపు వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటించిన చిత్రం ‘నా వైఫ్ మిస్సింగ్’. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఆహా వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా మేకర్స్ ‘నా వైఫ్ మిస్సింగ్’ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటిస్తూ నిమిషం నిడివి గల టీజర్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 22 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఆహాలో సినిమా స్ట్రీమింగ్ కానుంది. సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న జంట ఆనందంగా జీవితాన్ని కొనసాగించే సన్నివేశాలతో టీజర్ మొదలవుతుంది. అయితే అనుకోకుండా భార్య కనిపించకుండా పోవడంతో కథలో అసలు మలుపు మొదలవుతుంది. భర్త పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం, టీజర్‌లోని ఆసక్తికరమైన డైలాగ్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!