

2008లో విడుదలైన కొత్త బంగారు లోకం చిత్రంతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ మరోసారి కలిసి నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ హిట్ జోడీ నా వైఫ్ మిస్సింగ్ అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో కథపై ఆసక్తి పెరిగింది.
ఈ సిరీస్‌లో వరుణ్ సందేశ్ బాలు అనే బ్యాంకు ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారు. అతని భార్య అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో బాలు పోలీసులను ఆశ్రయిస్తాడు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ అనేక అనుమానాస్పద అంశాలు బయటకు వస్తాయి. అసలు బాలు భార్యకు ఏమైంది? ఆమె కనిపించకుండా పోవడం వెనుక బాలు పాత్ర ఏమైనా ఉందా? లేక ఆమె స్వయంగా ఎక్కడికైనా వెళ్లిపోయిందా? అనే ప్రశ్నల చుట్టూ కథ సాగనున్నట్లు గ్లింప్స్ సూచిస్తోంది. ఆహా ఈ సిరీస్ అధికారిక స్ట్రీమింగ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!