

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘రణబాలి’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భారతీయ చరిత్రలోని కొన్ని కీలక ఘట్టాల నేపథ్యంలో రణబాలి అనే కల్పిత పాత్రను రూపొందించారు. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రావడంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఏర్పడింది.
థియేటర్లలో సినిమా విడుదలైన సమయంలో కొందరు కావాలనే సినిమాను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నించారనే చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో సినిమాను చూడని ప్రేక్షకులకు మరో అవకాశం లభించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ‘రణబాలి’కి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!