

మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్’ పేరుతో వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 13, 2026 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.
ఈ చిత్ర కథలో థానోస్ విశ్వంలోని సగం జీవరాశిని అంతం చేస్తాడు. ఆ పరిణామంతో మిగిలిన సూపర్‌హీరోలు తీవ్ర విషాదంలో మునిగిపోతారు. తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడంతో పాటు విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు వారు ఏకమై థానోస్‌తో చివరి పోరాటానికి సిద్ధమవుతారు. ఈ ఉత్కంఠభరితమైన కథే ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’కు ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజ్ నిర్మించగా, ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!