

ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు పౌరాణిక స్పర్శ కలిగిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటిలో ‘వనవీర’ సినిమా ఒకటి. ఈ చిత్రం రామాయణంలోని కిష్కింధకాండ ఎపిసోడ్‌తో ముడిపడి ఉంటుంది. థియేటర్లలో సాధారణ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
‘వనవీర’ చిత్రంలో అవినాష్ హీరోగానే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరించాడు. మొదట ఈ సినిమాకు ‘వానర’ అనే టైటిల్ పెట్టారు కానీ సెన్సార్ అభ్యంతరాల కారణంగా పేరు మార్చారు. న్యూఇయర్ సందర్భంగా జనవరి 1 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆ రోజు వచ్చిన ఇతర చిత్రాల కారణంగా పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా, నందు విలన్‌గా నటించారు.
కథ విషయానికొస్తే – వనపురానికి చెందిన మధ్యతరగతి యువకుడు రఘు (అవినాష్), ఐఐటీ చదివినా ఉద్యోగం లేక ఊర్లో తిరుగుతుంటాడు. తండ్రి ఇచ్చిన బైక్‌పై అతనికి ఎంతో ప్రేమ. ఆ బైక్‌ను రాజకీయ ర్యాలీ కోసం దేవా (నందు) తీసుకుపోతాడు. బైక్ తిరిగి రాకపోవడంతో రఘు దేవా ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలే కథ యొక్క హైలైట్. ఈ కథకు రామాయణంలోని వానర జాతి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేదే సినిమాలోని ఆసక్తికర అంశం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!