

టాలీవుడ్‌లో తెరకెక్కిన సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ ‘వదలా’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. జూలై 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
ఇప్పుడు ‘వదలా’ మరో ఓటీటీ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 3 నుంచి ఈటీవీ విన్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా మరింత మంది తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు చేరువ కానుంది. అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, శ్రేయ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. కిషోర్ నాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈటీవీ విన్‌లో ‘వదలా’కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!