2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

Writer: Chandrika 12:54 PM, 2 సెప్టెంబర్, 2026
ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టర్కీ నుంచి అమెరికాకు తిరుగు ప్రయాణంలో రహస్యంగా విమానం మార్చిన ఘటన మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూలై 8న అంకారాలో నాటో సదస్సు ముగించుకున్న అనంతరం భద్రతా కారణాలతో ట్రంప్‌ను ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ నుంచి మరో సైనిక విమానంలోకి రహస్యంగా తరలించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ట్రంప్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌లోనే ప్రయాణిస్తున్నారనే భావన కలిగిస్తూ.. వాస్తవంగా ఆయన మరో విమానంలో ఉండేలా ఈ ‘డీకాయ్‌ ప్లేన్‌’ ఆపరేషన్‌ చేపట్టినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్‌ నుంచి ముప్పు ఉండొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ట్రంప్‌ను ఒక విమానం నుంచి మరో విమానానికి క్యాటరింగ్‌ ట్రక్కులో తరలించినట్లు కూడా రిపోర్టులు వెల్లడించాయి. ఈ రహస్య బదిలీలో కొద్దిమంది అధికారులు మాత్రమే ఆయన వెంట ఉన్నట్లు తెలుస్తోంది.

టర్కీ నుంచి బయలుదేరిన సైనిక విమానం బ్రిటన్‌లోని రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ మిల్డెన్‌హాల్‌ స్థావరానికి చేరుకున్న తర్వాత ట్రంప్‌ మరోసారి విమానం మార్చి అమెరికాకు వెళ్లినట్లు కథనాలు తెలిపాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సోషల్‌ మీడియాలో అనేక ఊహాగానాలు, చర్చలు జరిగాయి. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. తనకు ముప్పులు ఉండటం సహజమేనని, తాను భయపడే వ్యక్తిని కాదని, అయితే సీక్రెట్‌ సర్వీస్‌, సైనిక అధికారులు సురక్షితమైన మార్గంగా సూచించడంతో వారి సలహాను పాటించినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ రహస్య ప్రయాణం వెనుక జరిగిన పరిణామాలను Instadocs: The Decoy Plane పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీగా తీసుకొస్తోంది. ఘటనను తొలిసారి రిపోర్ట్‌ చేసిన జర్నలిస్టులతో పాటు వైట్‌హౌస్‌, విమానయాన రంగం, మాజీ సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది ఇంటర్వ్యూలు ఇందులో ఉండనున్నాయి. సెప్టెంబర్‌ 4 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?

ఈ వారం ఓటీటీలో 18 కొత్త రిలీజ్‌లు.. డీసీ, కొరియన్ కనకరాజుతో పాటు మరెన్నో!

ఈ వారం ఓటీటీలో 18 కొత్త రిలీజ్‌లు.. డీసీ, కొరియన్ కనకరాజుతో పాటు మరెన్నో!

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5

ట్యాగ్లు
డొనాల్డ్‌ ట్రంప్‌ట్రంప్‌ రహస్య ప్రయాణంఎయిర్‌ ఫోర్స్‌ వన్‌డీకాయ్‌ ప్లేన్‌నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీఇన్‌స్టాడాక్స్‌నాటో సదస్సుట్రంప్‌ భద్రతసీక్రెట్‌ సర్వీస్‌అమెరికా అధ్యక్షుడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల
సినిమాలు

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
జనరల్

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!
ఓటీటీ

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు
జనరల్

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..
సినిమాలు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌
సినిమాలు

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్
జనరల్

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్
సినిమాలు

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్

దిశా సాలియన్‌  మృతి కేసులో కీలక మలుపు..
జనరల్

దిశా సాలియన్‌ మృతి కేసులో కీలక మలుపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!