

‘ధురంధర్’లో అజిత్ దోభాల్‌ను పోలిన అజయ్ సన్యాల్ పాత్రలో మెప్పించిన మాధవన్.. ఇటీవల ‘జీడీఎన్’ సినిమాలో ప్రముఖ ఆవిష్కర్త జి.డి. నాయుడు పాత్రలో ఆకట్టుకున్నారు. కృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 4 నుంచి ‘జీడీఎన్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో దుశారా విజయన్, ప్రియమణి, జయరామ్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు.
కోయంబత్తూరులోని రైతు కుటుంబంలో జన్మించిన జి.డి. నాయుడు చదువు మూడో తరగతితోనే ఆగిపోయినా, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని మాత్రం కొనసాగించారు. బ్రిటిష్ కాలంలో ఓ వ్యక్తి వద్ద చూసిన మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి, దాని పనితీరును అర్థం చేసుకున్న ఆయన సొంత ఆలోచనలతో అనేక పరికరాలను రూపొందించారు. భారతదేశంలో తొలి విద్యుత్ మోటార్ తయారీతో పాటు పలు ఆవిష్కరణలు చేశారు. ఆయన ఎదుగుదలను అడ్డుకునేందుకు బ్రిటిష్ అధికారులు, కొందరు పారిశ్రామికవేత్తలు పన్నుల భారాన్ని పెంచి ఇబ్బందులకు గురిచేస్తారు. ఈ సవాళ్లను జి.డి. నాయుడు ఎలా ఎదుర్కొన్నారు? అనేదే చిత్ర కథ.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!