

ఈ వారం ఓటీటీల్లో పెద్దగా తెలుగు సినిమాలు లేకపోయినా, ఇప్పుడు అకస్మాత్తుగా ఒక తెలుగు హారర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదలైన ‘ఈషా’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతుండగా, మన దేశంలో ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయని నిర్మాతలు తెలిపారు.
కథ విషయానికొస్తే, కల్యాణ్, నయన, అపర్ణ, వినయ్ చిన్ననాటి స్నేహితులు. వీరు దెయ్యాలు, ఆత్మలు లేవని నమ్ముతారు. దొంగ బాబాలు, స్వామిజీల మోసాలను బయటపెట్టడం వీరి పని. ఈ క్రమంలో ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో ఉన్న ఆదిదేవ్ బాబా గురించి తెలుసుకుని అతడిని కలుస్తారు. ఆత్మల విషయంలో బాబా వీరికి ఒక సవాలు చేస్తాడు. ఆ సవాలు ఏమిటి? చివరకు వీరు ఏం తెలుసుకున్నారు? వీరిని చంపాలనుకునే పుణ్యవతి ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!