
సినిమాలు

‘అమీర్ లోగ్’ చిత్రం నుంచి విడుదలైన ‘సీదా హెలికాప్టర్ షాట్’ పాట యువతను ఆకట్టుకునే స్ట్రీట్ ఆంథమ్‌గా నిలుస్తోంది. స్మరణ్ సాయి స్వరపరిచిన ఈ గీతాన్ని ఎంసీ హరి రచించి ఆలపించారు. స్నేహం, ఆత్మవిశ్వాసం, లక్ష్య సాధనపై దృష్టి సారించిన ఈ పాట సినిమాలోని ప్రధాన పాత్రల అనుబంధాన్ని హైలైట్ చేస్తోంది.
లిరికల్ వీడియోలో సహజమైన విజువల్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ వీధుల అందాన్ని అద్భుతంగా చిత్రీకరించిన ఈ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించగా, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా తెలుగు థియేట్రికల్ విడుదల బాధ్యతలు చేపట్టింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!