

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామా ‘శ్రీ చిదంబరం గారు’ ఈ నెల (ఫిబ్రవరి) 6 న థియేటర్లలో విడుదలైంది. నూతన దర్శకుడు వినయ్ రత్నం తొలి చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రమోషన్లతో మంచి ఆసక్తి రేకెత్తించినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం మిశ్రమ స్పందన పొందింది. పల్లెటూరి కథ, కొన్ని చోట్ల మెప్పించినా, మొత్తం మీద ప్రేక్షకులతో పూర్తిగా కలిసిపోలేకపోయింది.
ఇప్పుడీ చిత్రం థియేటర్ రన్ ముగియక ముందే డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుని, ఈ నెల (ఫిబ్రవరి) 19 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. విడుదలైన కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి రావడం ఆశ్చర్యంగా మారింది.
వంశీ తుమ్మల ప్రధాన పాత్రలో నటించగా, సంధ్య వశిష్ట హీరోయిన్గా కనిపించింది. తులసి, కల్పలత, గోపీనాథ్ వంటి సీనియర్ నటీనటుల నటన సినిమాకు బలంగా నిలిచింది. థియేటర్లలో ఆశించిన ఫలితం రాకపోయిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!