

తెలుగు, తమిళ, కన్నడలో చాలా సినిమాలు చేసిన నటుడు అర్జున్ సర్జా ఇటీవల తన సినిమాల వేగాన్ని తగ్గించారు. కొంతకాలం క్రితం ఆయన తన కుమార్తె ఐశ్వర్యని హీరోయిన్‌గా పెట్టి ఒక సినిమా ప్రారంభించారు. మొదట ఈ చిత్రంలో హీరోగా విశ్వక్ సేన్‌ని తీసుకున్నాడు. అనుకోని కారణాలతో విశ్వక్.. ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాడు. తర్వాత మరో హీరోతో చిత్రాన్ని పూర్తి చేశారు. గత నెలలోనే థియేటర్లలోకి కూడా తీసుకొచ్చేశారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.
అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు 'సీతా పయనం'. ఇందులో ఐశ్వర్య హీరోయిన్‌గా నటించగా, కన్నడ నటుడు నిరంజన్ హీరోగా కనిపించారు. ప్రముఖ నటుడు సత్యరాజ్ కూడా ముఖ్య పాత్రలో నటించారు. గత నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. అయితే ఉగాది సందర్భంగా రేపటి నుంచి ఈ చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది.
కథ విషయానికి వస్తే, సీత (ఐశ్వర్య)చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. దీంతో తండ్రి(సత్యరాజ్)లోనే తల్లిని చూసుకుంటూ ఉంటుంది. తాను లేకపోతే తండ్రి ఏమైపోతడోనని పెళ్లి కూడా చేసుకోదు. ఓసారి ఒంటరిగా కారులో హైదరాబాద్‌కి ప్రయాణమవుతుంది. దారి మధ్యలో అభి(నిరంజన్) లిఫ్ట్ అడిగితే.. కండీషన్స్ పెట్టి ఊరి దగ్గర దించేస్తుంది. అయితే ఈ ఇద్దరూ కలిసి చేసిన ప్రయాణంలో ఎవరెవరు ఎదురయ్యారు? సీత.. మళ్లీ అభిని ఎందుకు కలవాల్సి వచ్చింది? ఈ ప్రయాణం సీత జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది మిగతా స్టోరీ.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!