
టెక్నాలజీ

గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం రూ.1,69,341 కోట్లు అప్పు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించారు. 2024–25లో రూ.82,855 కోట్లు, 2025–26లో రూ.86,486 కోట్లు రుణాలు తీసుకున్నట్లు తెలిపారు.
అప్పులు, ఆర్థిక లోటు తగ్గించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేనని కేంద్రం స్పష్టం చేసింది. 2024–25లో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.78,205 కోట్లు, 2025–26లో రూ.82,272 కోట్లు సమీకరించగా, బ్యాంకుల నుంచి వరుసగా రూ.900 కోట్లు, రూ.1,633 కోట్లు రుణాలు తీసుకున్నట్లు వివరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!