

మాస్ మహారాజ రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. ఫస్ట్ లుక్ నుంచే మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత మంచి వసూళ్లు సాధించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి కూడా స్పందన పొందుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ర్యాంకింగ్స్ ప్రకారం ఇరుముడి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాప్ 3 నాన్-ఇంగ్లిష్ సినిమాల్లో ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో టాప్ 10 సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమా తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!