12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల సందడి

Writer: Nithish 08:22 AM, 11 నవంబర్, 2026
ఈ వారం ఓటీటీలో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల సందడి

ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ వారం యాక్షన్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌, కామెడీ, టైమ్‌ ట్రావెల్‌ వంటి విభిన్న జానర్లలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన జైలర్‌ 2 నవంబర్‌ 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి రానుంది. జైలర్‌ ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీకాంత్‌ మరోసారి యాక్షన్‌ అవతార్‌లో కనిపించనున్నారు. కుటుంబం, విధి, ప్రతీకారం చుట్టూ సాగే కథకు భారీ యాక్షన్‌ సన్నివేశాలు, మాస్‌ ఎలిమెంట్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి నవంబర్‌ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం వీరత్వం, పోరాటం, ప్రేమ, కుటుంబ బంధాలు, ప్రతీకారం వంటి అంశాలతో సాగుతుంది. అలాగే హ్యాపీ జర్నీ నవంబర్‌ 13 నుంచి సన్‌ నెక్స్ట్‌లో ప్రసారం కానుంది. బెంగళూరు ప్రయాణంలో కలుసుకునే వ్యక్తుల కథతో రూపొందిన ఈ చిత్రంలో ఆమని, అన్నపూర్ణమ్మ, ఝాన్సీ తదితరులు నటించారు. ఉచితంగా యూరప్‌ పర్యటనకు వెళ్లే అవకాశం పొందిన ఏడుగురు మహిళల ప్రయాణం, వారి జీవితాల్లో చోటుచేసుకునే మార్పులు ఈ చిత్ర కథాంశం.

ఇక క్రైమ్‌ థ్రిల్లర్‌ దాయిరా నవంబర్‌ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, కరీనా కపూర్‌ ఖాన్‌ పోలీసు అధికారులుగా నటించారు. చట్టం, తక్షణ న్యాయం మధ్య ఉండే నైతిక సంఘర్షణను కథలో చూపించారు. తమన్నా భాటియా నటించిన మలయాళ యాక్షన్‌ డ్రామా బాంద్రా అదే రోజు జీ5లో అందుబాటులోకి రానుంది. మరో క్రైమ్‌ థ్రిల్లర్‌ ది థర్డ్‌ మర్డర్‌ మనోరమ మ్యాక్స్‌, సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లు కూడా ఈ వారం అలరించనున్నాయి. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో రూపొందిన పుష్పక విమానం నవంబర్‌ 12 నుంచి జియోహాట్‌స్టార్‌లో, కరణ్‌ జోహార్‌ రూపొందించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్ నవంబర్‌ 13 నుంచి అదే వేదికపై స్ట్రీమింగ్‌ కానున్నాయి. మొత్తంగా ఈ వీకెండ్‌లో కొత్త సినిమాలు, సిరీస్‌లతో ఓటీటీ ప్రేక్షకులకు వినోదం అందనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2 ఓటీటీ నిడివిపై అభిమానులకు నిరాశ?

జైలర్ 2 ఓటీటీ నిడివిపై అభిమానులకు నిరాశ?

వారణాసి: ఓటీటీ హక్కుల ధరతో భారీ సంచలనం?

వారణాసి: ఓటీటీ హక్కుల ధరతో భారీ సంచలనం?

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘హనుమాన్ అంశ్’

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘హనుమాన్ అంశ్’

విడుదలకు ముందే ఈఎన్ఈ రిపీట్‌ భారీ ఓటీటీ డీల్

విడుదలకు ముందే ఈఎన్ఈ రిపీట్‌ భారీ ఓటీటీ డీల్

రామాయణ ఓటీటీ వెర్షన్‌పై కొత్త చర్చ

రామాయణ ఓటీటీ వెర్షన్‌పై కొత్త చర్చ

ఓటీటీలోకి ‘హ్యాపీ జర్నీ’ఎప్పుడంటే?

ఓటీటీలోకి ‘హ్యాపీ జర్నీ’ఎప్పుడంటే?

ట్యాగ్లు
ఓటీటీ విడుదలలుజైలర్ 2రణబాలిహ్యాపీ జర్నీదాయిరాబాంద్రాది థర్డ్ మర్డర్పుష్పక విమానంస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్కొత్త సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!