

థియేటర్లలో రిలీజ్ అయ్యిన సినిమాలు త్వరగా ఓటీటీలోకి రావడం నేటి ట్రెండ్‌గా మారిపోయింది. సాధారణంగా ఒక సినిమా ఓటీటీలోకి రావడానికి కనీసం 3–4 వారాలు పడితే, కేవలం ఒక్క వారం లోపే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చే చిత్రాలు చాలా అరుదు.
ఇలాంటి అరుదైన జాబితాలో ఇప్పుడు యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజా సినిమా కూడా చేరిపోయింది.
గత శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్, ఈ శుక్రవారం నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, పూర్తిగా సర్ప్రైజ్గా స్ట్రీమింగ్‌ను ప్రారంభించడం ప్రైమ్ వీడియో యూజర్లను ఆశ్చర్యపరిచింది.
సినిమాకు రాజ్ తరుణ్ గత కొన్నేళ్లలో వచ్చిన చిత్రాల కంటే మంచి టాక్ వచ్చినప్పటికీ, ఇలా కేవలం 7 రోజుల్లోనే ఓటీటీలో రావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్గా నటించగా, సినిమాకు దర్శకత్వం వహించింది రామ్ కడుముల.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!