

ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్న మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ హార్ట్ బీట్ ఇప్పుడు మూడో సీజన్‌తో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించింది. తొలి రెండు సీజన్లు మంచి ఆదరణ పొందడంతో మేకర్స్ మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ తాజా సీజన్ ఈ రోజు నుంచి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది.
దీపక్ సుందర రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఆస్పత్రి నేపథ్యంలో సాగుతూ కుటుంబ బంధాలు, ప్రేమ, భావోద్వేగాలు, తల్లి ప్రేమ కోసం ఓ యువతి చేసే ప్రయాణాన్ని హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది. దీపా బాలు, అనుమోల్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రే ప్రధాన పాత్రల్లో నటించారు. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కూడా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!