

మలయాళ సినిమాలకు ఓటీటీ వేదికల్లో మంచి డిమాండ్ ఉంది. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేసి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన పెన్నుమ్ పోరాట్టమ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం ఈ నెల 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ చిత్రానికి రాజేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఇందులో రాజేష్ మాధవన్, రైనా రాధాకృష్ణన్, సుభాష్ చంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కేరళలోని ఒక గ్రామం నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. ఆ గ్రామంలోని రూల్స్‌ను ఓ యువతి, ఓ కుక్క ఎలా బ్రేక్ చేశారనే కోణంలో సెటైరికల్‌గా తెరకెక్కించారు. సరదాగా నవ్వించే ఈ కామెడీ ఎంటర్టైనర్ను ఇప్పుడు ఓటీటీలో చూసి ఆస్వాదించవచ్చు.








.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!