

మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ గతేడాది విడుదలైన ‘కూలీ’ సినిమా ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు మరింతగా పరిచయమయ్యాడు. ఇప్పుడు ఆయన నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ పాతిరాత్రి ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో సౌబిన్ కనిపిస్తాడు. సినిమా గత ఏడాది అక్టోబర్ 17 న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇప్పుడు దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ చిత్రం ఈ నెల 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్గా నవ్వ నాయర్ నటించారు. 'పాతిరాత్రి' విషయానికొస్తే.. ఝాన్సీ కురియన్(నవ్వ నాయర్) ఎస్సై. హరీష్(సౌబిన్ షాహిర్) ఓ కానిస్టేబుల్. ఓ రోజు రాత్రి గస్తీలో ఉన్నప్పుడు ఓ అనుమానాస్పద వ్యక్తిని వెంబడిస్తారు. తర్వాత అతడు అదృశ్యమవుతాడు. తర్వాత రోజు అతడి మృతదేహం దొరుకుతుంది. దీంతో పోలీసులిద్దరూ నిందితులు అవుతారు. తర్వాత ఏమైంది? ఇంతకీ ఆ వ్యక్తిని హత్య చేసింది ఎవరు? అనేదే మిగతా స్టోరీ.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!