

థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టిన ‘పెద్ది’ మరోసారి తన సత్తా చాటుతోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, జాన్వీ కపూర్ కథానాయికగా దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యం, క్రీడా స్ఫూర్తి, కుటుంబ భావోద్వేగాలను మేళవించిన ఈ చిత్రం బిగ్ స్క్రీన్‌పై మంచి స్పందన అందుకుంది. తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో దక్షిణాది భాషల్లో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా అదే స్థాయి ఆదరణను అందుకుంటోంది.
విడుదలైన తొలి రోజుకే దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుని ‘పెద్ది’ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఓటీటీలోకి వచ్చిన వెంటనే నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వడం చిత్రబృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమాలో దివ్యెందు, జగపతి బాబు, శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించగా, ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వృద్ది సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్ల తర్వాత డిజిటల్ వేదికపైనా తన విజయయాత్రను కొనసాగిస్తుండటం విశేషం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!