

తమిళ నటుడు శివకార్తికేయన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఆయన తాజా చిత్రం ‘పరాశక్తి’ లో శ్రీలీల హీరోయిన్గా నటించింది. పీరియాడిక్ కథతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10 న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. అయితే విడుదలైన తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 7 వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో ఈ సినిమాను చూడలేని వారు ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం లభించింది.
1964 లో తమిళనాడులోని ఓ గ్రామంలో జరిగిన ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిందీని జాతీయ భాషగా ప్రకటించిన తర్వాత మధురై సమీపంలోని ఓ గ్రామంలో విద్యార్థులు, గ్రామస్థులు, ఓ పోలీస్ మధ్య జరిగిన సంఘటనల చుట్టూ కథ సాగుతుంది. సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉండటంతో సెన్సార్ బోర్డ్ 20 కి పైగా కట్స్ సూచించింది. సెన్సార్ వివాదం ముగిసిన తర్వాతే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!