

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంటెంట్‌పై చిరంజీవి, దర్శకుడు వశిష్ఠకు ఉన్న నమ్మకం కారణంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో క్రమంగా హైప్ తగ్గుతూ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం ‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఖరారైనట్లు తెలుస్తోంది. సోనీ లివ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో పోటీలో ఉండగా, చివరకు ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో థియేట్రికల్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్టుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ‘విశ్వంభర’ను తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ను కూడా సంక్రాంతి బరిలోనే విడుదల చేస్తామని మేకర్స్ వరుస అప్‌డేట్స్‌లో చెబుతున్నారు. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏది ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!