

గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసినప్పటికీ ఈ ఏడాది రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో ఐశ్వర్యా రాజేశ్ మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు ఆమె మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపించనుంది. అర్జున్ సర్జా, ఐశ్వర్యా రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘తీయవర్ కులై నడుంగ’ అనే తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గత నెల 21 న థియేటర్లలో విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను ‘మఫ్టీ పోలీస్’ పేరుతో రిలీజ్ చేశారు.
సరైన ప్రమోషన్లు లేకపోవడంతో సినిమా ప్రేక్షకులకు పెద్దగా తెలియకుండానే థియేటర్ల నుండి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. తమిళ వెర్షన్ ఇప్పటికే సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, తెలుగు వెర్షన్ ‘మఫ్టీ పోలీస్’ ఈ శుక్రవారం (డిసెంబర్ 19) నుండి ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
సినిమా కథ విషయానికొస్తే — ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో అర్థరాత్రి రచయిత జెబా దారుణంగా హత్యకు గురవుతారు. ఈ కేసు విచారణని ఇన్స్పెక్టర్ మాగుడపాటి (అర్జున్ సర్జా) తీసుకుంటాడు. అయితే అపార్ట్మెంట్లోని ప్రతి ఒక్కరు అనుమానితులుగా కనిపిస్తారు. మరి వారిలో అసలైన నిందితుడుని పట్టుకున్నాడా లేదా? ఎవరు హత్య చేశారు? అనుమానితుల నుంచి బయటపడిన రహస్యాలు ఏంటి? ఇందులో ఐశ్వర్యా రాజేశ్ పాత్రేంటి అనేది మిగతా స్టోరీ.



.webp&w=3840&q=75)














.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!