
సినిమాలు

జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైల్వే బోర్డు తిరస్కరించింది. ఇప్పటికే ఎంఎంటీఎస్ సేవలు భారీ ఆర్థిక నష్టాల్లో నడుస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని రైల్వే బోర్డు తన లేఖలో పేర్కొంది.
రైల్వే అధికారుల వివరాల ప్రకారం, గత ఏడాదిలో ఎంఎంటీఎస్ సేవలకు దాదాపు రూ.160 కోట్ల నష్టం వచ్చింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.490 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించలేదని తెలిపారు. ఉచిత ప్రయాణం వల్ల కలిగే అదనపు నష్టాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందనే హామీ ఇస్తే మాత్రమే ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!