

తమన్నాతో సంబంధం వల్ల గతంలో వార్తల్లో నిలిచిన నటుడు విజయ్ వర్మ ఇప్పుడు తన కొత్త క్రైమ్ డ్రామా సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయడంతో పాటు స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించారు.
మట్కా అనే పాతకాలపు బెట్టింగ్ ఆట నేపథ్యంగా రూపొందిన ఈ సిరీస్‌లో విజయ్ వర్మతో పాటు కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నాగరాజ్ ముంజలే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ వచ్చే నెల 17 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికలో ప్రసారం కానుంది.
టీజర్‌ను చూస్తే ముంబైకి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. 1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? ఈ క్రమంలోనే అండర్ వరల్డ్, పోలీసులని ఎలా ఎదుర్కొన్నాడు? తదితర అంశాలే స్టోరీ అని తెలుస్తోంది. గతంలో తెలుగులో 'మట్కా' పేరుతో వరుణ్ తేజ్ హీరోగా సినిమా వచ్చింది గానీ అది ఘోరమైన డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడొస్తున్నది సిరీస్ కాబట్టి ఇందులో స్టోరీ మరింత రియలస్టిక్‌గా చూపించే అవకాశముంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!