

కార్తీ నటించిన వా వాథియార్, సర్దార్ 2 చిత్రాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో తక్కువ వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చాయి. ఒకే ఏడాదిలో కార్తీ సినిమాలు వరుసగా డిజిటల్ వేదికపైకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు కారణమైంది. వా వాథియార్ థియేటర్లలో విడుదలైన 14 రోజులకే జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇక సర్దార్ 2 కూడా విడుదలైన 21 రోజులకే అక్టోబర్ 1 నుంచి అదే వేదికలో ప్రేక్షకులకు అందుతోంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు నాలుగు నుంచి ఎనిమిది వారాల థియేట్రికల్ విండో ఉండటం తెలిసిందే.
అయితే నెల రోజులు పూర్తికాకముందే డిజిటల్ విడుదల జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాక్సాఫీస్ ఫలితాల ఆధారంగా ఓటీటీ విడుదల వ్యవధి తగ్గుతున్న తీరు థియేటర్లపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఇంట్లోనే చూసే అవకాశం ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో పెరిగితే, భవిష్యత్ చిత్రాల థియేట్రికల్ వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. కార్తీ సినిమాల విషయంలో మొదలైన ఈ చర్చ ఇప్పుడు పరిశ్రమలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!