

యూత్‌ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందిన జిగ్రీస్ సినిమా విడుదలకు ముందే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అందించిన సపోర్ట్ ఈ చిత్రానికి పెద్ద బలంగా మారింది. ట్రైలర్ లాంచ్ చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరుకావడం ద్వారా వంగా ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు. కృష్ణ బురుగుల, మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్, మణి వాకా, ధీరజ్ ఆత్రేయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 14 న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జిగ్రీస్ ఈ నెల 6 నుంచి సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లతో పోలిస్తే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ సినిమాకు మెరుగైన ఆదరణ లభిస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాతో హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సయీద్ కమ్రాన్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా, ఓటీటీ విడుదలతో జిగ్రీస్ సినిమాకు కొత్త ఊపిరి లభిస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!