

రవితేజ నటించిన ‘ఇరుముడి’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో రవితేజతో పాటు నటించిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా హీరో కూతురి పాత్రలో నటించిన చిన్నారి నక్షత్ర తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు నక్షత్ర నటించిన మరో సినిమా ఓటీటీలోకి రావడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు ప్రధాన పాత్రల్లో నటించిన హీస్ట్ థ్రిల్లర్ ‘ఐ నోబడీ’ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ కథ రూ.17 కోట్ల బ్యాంకు దోపిడీ చుట్టూ తిరుగుతుంది. సెక్రటేరియట్‌లో పనిచేసే సాధారణ ప్రభుత్వ ఉద్యోగి రాజీవన్ పాత్రలో పృథ్వీరాజ్ కనిపిస్తారు. బ్యాంక్ దోపిడీ సమయంలో దొంగలు రాజీవన్‌ను బందీగా తీసుకెళ్లగా.. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో వారు మృతి చెందుతారు. రాజీవన్ మాత్రం ప్రాణాలతో బయటపడతాడు. అయితే దోపిడీకి గురైన రూ.17 కోట్లు మాత్రం కనిపించకుండా పోతాయి. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది? దాని వెనుక ఎవరున్నారు? రాజీవన్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. ఇందులో నక్షత్ర రాజీవన్ కూతురిగా కనిపించి ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!