
.png&w=3840&q=75)
ధనుష్ (Dhanush), నిత్యా మేనన్ (Nithya Menon) జంటగా నటించిన చిత్రం 'ఇడ్లీ కొట్టు' (Idli Kottu Movie). ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన వ్యక్తిత్వం కోసం ఉద్యోగాన్ని వదిలి.. తండ్రి వారసత్వంగా ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తి పాత్రలో ధనుష్ కనిపించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందడం, విజయవంతమైన 'తిరు' తర్వాత ధనుష్, నిత్యామేనన్ కలిసి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఆ స్థాయి వినోదాన్ని మాత్రం అందించలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అక్టోబరు 29వ తేదీ (idli kottu release date) నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను పంచుకుంది.
ఇంతకీ కథేంటంటే..
శివ కేశవులు (రాజ్‌కిరణ్) ఇడ్లీ కొట్టు అంటే ఆ ఊళ్లో ఫేమస్. ఎంతో ఇష్టంగా, మనసు పెట్టి చేసే ఆ కొట్లో ఇడ్లీలు ఎంతో రుచికరం. శివ కేశవులు కొడుకే మురళి (ధనుష్). కొత్తతరం కుర్రాడు కదా, తన తండ్రి నడుపుతున్న కొట్టుని కాస్త ఫ్రాంచైజీలా మార్చేసి, అదే పేరుతో ఇతర చోట్ల కూడా హోటల్ని ఏర్పాటు చేసి డబ్బు సంపాదించాలని ఆశపడతాడు. కానీ, తన చేతులతో చేయని ఇడ్లీలను తన పేరుతో అమ్మడానికి ససేమిరా ఇష్టపడడు శివకేశవులు. దాంతో మురళి ఉన్నతమైన జీవితం అంటూ కన్నవాళ్లని, ఉన్న ఊరుని వదిలి పట్నం బాట పడతాడు. (idli kottu movie) అలా మొదలైన అతని పరుగు బ్యాంకాక్‌కి చేరుతుంది. పనుల్లో పడి కన్నవాళ్లని కూడా పట్టించుకోడు.
బ్యాంకాక్‌లోనే తన బిజినెస్‌లో పార్ట్నర్ అయిన విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలిని పాండే)తో పెళ్లి నిశ్చయమవుతుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా మురళి తండ్రి శివ కేశవులు చనిపోతాడు. తండ్రి చివరి చూపు కోసం వచ్చిన మురళి తిరిగి బ్యాంకాక్ వెళ్లాడా లేదా? శివకేశవులు చనిపోయాక ఆయన ఇడ్లీ కొట్టు ఏమైంది? మురళికీ, కల్యాణి (నిత్య మేనన్)కీ మధ్య సంబంధం ఏమిటి? మీరాతో అతని పెళ్లి జరిగిందా? అన్నది చిత్ర కథ.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!