

2024 లో విడుదలై భారీ చర్చకు దారితీసిన ఇండియన్ కాంట్రవర్సియల్ వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ ఇప్పుడు సీజన్ 2 తో తిరిగి వచ్చింది. సోనీ లివ్ నిర్మించిన ఈ సిరీస్ భారత స్వాతంత్య్ర కాలంలోని కీలక సంఘటనలను ఆధారంగా తీసుకుని, గాంధీ, నెహ్రూ వంటి ప్రముఖ నాయకుల పాత్రలను చూపిస్తుంది. దర్శకుడు నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన మొదటి సీజన్, చరిత్రలోని కొన్ని గాఢమైన కోణాలను చూపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు అధికారికంగా ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 ను మేకర్స్ విడుదల చేశారు. ఇది నిన్నటి(jan 9,friday) నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్ చూసినవారు ఈ సీజన్‌ను కొనసాగించి చూడవచ్చు. ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, మరాఠీ మరియు బెంగాళీ భాషల్లో అందుబాటులో ఉంది.
ఈ సిరీస్‌లో సిద్ధాంత్ గుప్తా, చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ల్యూక్ మెక్‌గిబ్నీ, కోర్డెలియా బుగేజా ముఖ్య పాత్రల్లో నటించారు. మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ, డానిష్ ఖాన్ ఈ సిరీస్‌కు నిర్మాతలుగా వ్యవహరించారు. మొదటి సీజన్ లాగే, ఈ సీజన్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!