
జనరల్

యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన ప్రేమకథా చిత్రం ‘దీవాన’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ చిత్రంతో స్మేహ మణిమేగలై కథానాయికగా, శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడిగా పరిచయమయ్యారు. గత నెల 20న థియేటర్లలో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
‘దీవాన’ జూలై 31 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ‘మిస్ అయితే మస్త్ ఫీల్ అయితవ్’ అంటూ చిత్రబృందం ఓటీటీ విడుదలను ప్రకటించింది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లు సాధారణ స్ట్రీమింగ్కు 24 గంటల ముందే ఎర్లీ యాక్సెస్ ద్వారా సినిమాను వీక్షించవచ్చు. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానున్న ‘దీవాన’ ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!